ఈ ఏడాది నా పెళ్లంటూ వస్తోన్న వార్తలు రూమర్లే: బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ఏడాది నా పెళ్లంటూ వస్తోన్న వార్తలు రూమర్లే: బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్

  • ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి.. మిగతా ఆలోచనలు లేవన్న నటి
  • ప్రముఖ ఫొటో గ్రాఫర్ రోహన్ శ్రేష్టాతో ప్రేమలో..?
  • గతంలో బాలీవుడ్ లో పెళ్లి వార్తలు.. ఖండించిన శ్రద్ధా తండ్రి శక్తి కపూర్
ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రంలో నటించిన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తన పెళ్లిపై వస్తోన్న వార్తలు వట్టివే అని కొట్టిపారేసింది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టాను ఆమె త్వరలో వివాహం చేసుకోబోతోందంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి తాను నటిగా కెరీర్ పైనే దృష్టి పెట్టానని తెలిపింది. ‘నా పెళ్లిపై వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవి పుకార్లు మాత్రమే. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాల గురించే ఆలోచిస్తున్నాను. అంతకుమించి దేనీ గురించి ఆలోచించడం లేదు’ అని చెప్పింది.

శ్రద్ధా కపూర్, రోహన్ శ్రేష్టాలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని, వీరిద్దరూ కలిసి పార్టీలకు, డిన్నర్లకు వెళుతున్నారని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని కూడా ప్రచారం ప్రారంభమైంది. ఈ వార్తలను శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఖండించారు. శ్రద్ధా తాజాగా ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’ చిత్రంతో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Shradda kapoor
Bollywood
Tollywoood
Marriage

More Telugu News