Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ నటుడు సునీల్ ఆసుపత్రిలో చేరడానికి కారణం ఇదే!

  • సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరానన్న సునీల్
  • డాక్టర్ల సూచన మేరకు చేరానని వివరణ
  • ఎవరూ ఆందోళన చెందవద్దని విన్నపం
సినీ నటుడు సునీల్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారనే వార్తతో సినీ వర్గాలు, అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ  నేపథ్యంలో, సునీల్ స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తెలిపారు. సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే ఆసుపత్రిలో చేరానని చెప్పారు. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో సునీల్ చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలను నిర్వహించిన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Sunil
Tollywood

More Telugu News