ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై సభలో చర్చ
- భవిష్యత్తు తరాల్లో మార్పునకు ఇంగ్లిష్ విద్య తప్పనిసరన్న ఎమ్మెల్యే వరప్రసాద్
- ప్రస్తుతం విద్య అనేది సవాలుగా మారిందని వ్యాఖ్య
ప్రస్తుతం విద్య అనేది సవాలుగా మారిందని అన్నారు. అసమానతలు తొలగాలంటే అందరికీ విద్య అవసరమని అన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలంటే అందరికీ విద్యే మార్గమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం మంచి నిర్ణయమన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిపై జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని చెప్పారు.