ఏ2 ముద్దాయికి శాసనమండలిలో ఏం పని?: పంచుమర్తి అనురాధ
- ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారు
- విజయసాయి బెయిల్ ను రద్దు చేయాలి
- చంద్రబాబు ఛాంబర్ లో టీవీ ప్రసారాలు కట్ చేశారు
ఏ1, ఏ2లు బెయిల్ పై ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదని అనురాధ ఎద్దేవా చేశారు. ప్రజల కోట్లాది సొమ్మును విజయసాయిరెడ్డి కొట్టేశారని ఆరోపించారు. జగన్ రాజకీయ భవిష్యత్తు బాగుంటే కేసులు మాఫీ అవుతాయనే దురాలోచనలో విజయసాయి ఉన్నారని అన్నారు. మండలిలో కొన్ని చానళ్లను నిలిపివేయడం సరికాదని చెప్పారు. చంద్రబాబు చాంబర్ లో కూడా టీవీ ప్రసారాలను నిలిపివేశారని మండిపడ్డారు.