'ఎఫ్ 3' కోసం రవితేజ పేరు గట్టిగానే వినిపిస్తోంది
- 'ఎఫ్ 2' సీక్వెల్ కి సన్నాహాలు
- చకచకా జరిగిపోతున్న పనులు
- రవితేజ రంగంలోకి దిగుతున్నాడంటూ వార్తలు
'ఎఫ్ 2' సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. రాజేంద్రప్రసాద్ నటించారు. 'ఎఫ్ 3'లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో పాటు రవితేజ కనిపించనున్నట్టు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ విషయంలో రవితేజ పేరు మరింత గట్టిగానే వినిపిస్తోంది. ఆల్రెడీ గతంలో అనిల్ రావిపూడి - రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'రాజా ది గ్రేట్' విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఎఫ్ 3' కోసం రవితేజ రంగంలోకి దిగనున్నాడనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.