'ఎఫ్ 3' కోసం రవితేజ పేరు గట్టిగానే వినిపిస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎఫ్ 3' కోసం రవితేజ పేరు గట్టిగానే వినిపిస్తోంది

  • 'ఎఫ్ 2' సీక్వెల్ కి సన్నాహాలు 
  • చకచకా జరిగిపోతున్న పనులు 
  • రవితేజ రంగంలోకి దిగుతున్నాడంటూ వార్తలు  
అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఎఫ్ 2' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వినోదాల సందడి చేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అనిల్ రావిపూడి రంగంలోకి దిగాడు. 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

'ఎఫ్ 2' సినిమాలో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. రాజేంద్రప్రసాద్ నటించారు. 'ఎఫ్ 3'లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో పాటు రవితేజ కనిపించనున్నట్టు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ విషయంలో రవితేజ పేరు మరింత గట్టిగానే వినిపిస్తోంది. ఆల్రెడీ గతంలో అనిల్ రావిపూడి - రవితేజ కాంబినేషన్లో వచ్చిన 'రాజా ది గ్రేట్' విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఎఫ్ 3' కోసం రవితేజ రంగంలోకి దిగనున్నాడనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Venkatesh
Varun Tej
Raviteja

More Telugu News