'మండలి'లో స్మార్ట్‌ఫోన్ చూస్తూ జీవో చదివిన లోకేశ్.. మండిపడ్డ మంత్రులు బొత్స, బుగ్గన
- నవరత్నాల కోసం చర్చిలు, మసీదుల భూములు విక్రయించారన్న లోకేశ్
- జీవో ఇచ్చారని ఆరోపణ
- సభలోకి సెల్‌ఫోన్ తీసుకురావడం సంప్రదాయాలకు విరుద్ధమన్న బొత్స
అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని లోకేశ్‌కు సవాలు విసిరారు. లోకేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. లోకేశ్ చదివివినిపించిన ఆ జీవో ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆ జీవో నంబర్ అయినా చెప్పాలని అన్నారు. లేదంటే సభకు లోకేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.