బాలకృష్ణ సినిమా కోసం భారీ పారితోషికం అడిగిన కేథరిన్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ సినిమా కోసం భారీ పారితోషికం అడిగిన కేథరిన్?

  • వచ్చేనెలలో సెట్స్ పైకి బోయపాటి 
  • హీరోయిన్ కోసం అన్వేషణ 
  • విలన్ పాత్రలో శ్రీకాంత్
మత్తుకళ్ల సుందరిగా యూత్ లో కేథరిన్ కి మంచి క్రేజ్ వుంది. 'సరైనోడు' ..' నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోను ఒక కథానాయికగా ఆమె కనిపించనుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సినిమా కోసం బోయపాటి టీమ్ ఆమెను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక జరిగిపోయిందని కూడా చెప్పుకున్నారు.

అయితే ఆమె ఈ సినిమా చేయడం లేదనేది తాజా సమాచారం. కేథరిన్ పారితోషికం ఎక్కువగా అడిగిందట. అందువలన ఆమెను పక్కన పెట్టేసి మరో కథానాయిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిబ్రవరి 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
Balakrishna
Srikanth

More Telugu News