సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హారర్ మూవీలో రాశిఖన్నా
  • వినాయక్ 'శీనయ్య' అప్ డేట్
  • తెలుగులోకి మరో కొరియన్ సినిమా
 *  అందాలతార రాశిఖన్నా తాజాగా ఓ హారర్ మూవీలో నటించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి 'అరణ్మనై' హారర్ చిత్రాల సీరీస్ లో మూడవ భాగాన్ని చేయనున్నారు. ఇందులో రాశిఖన్నా కథానాయికగా ఎంపికైంది.  
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'శీనయ్య' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును ఈ నెల 27 నుంచి హైదరాబాదులో నిర్వహిస్తారు. ఇందులో వినాయక్ మెకానిక్ గా కనిపిస్తాడు.
*  సమంత కథానాయికగా ఆమధ్య వచ్చిన 'ఓ బేబీ' చిత్రం ఓ కొరియన్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో కొరియన్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం వచ్చిన 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి దర్శకుడు సుధీర్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Rashikhanna
VV Vinayak
Dil Raju
Samantha

More Telugu News