మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించి మాట్లాడాలి: రజనీకాంత్ కు స్టాలిన్ సూచన
- పెరియార్ పై రజనీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు
- తన స్నేహితుడు రజనీ రాజకీయ నాయకుడు కాదన్న స్టాలిన్
- పెరియార్ లాంటి వారి గురించి మాట్లాడేముందు ఆలోచించాలంటూ సూచన
1971లో ఓ ర్యాలీలో నగ్నంగా ఉన్న సీతారాముల విగ్రహాలను పెరియార్ ఊరేగించారని రజనీకాంత్ వ్యాఖ్యానించినట్టు ఓ పత్రికలో వచ్చింది. దీంతో, ద్రవిడర్ విడుదలై కజగం పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెరియార్ ప్రతిష్ట దెబ్బతినేలా రజనీ వ్యాఖ్యానించారని మండిపడింది. రజనీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అయితే, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రజనీ తెగేసి చెప్పడం కొసమెరుపు.