డేవిడ్ వార్నర్ కు 'ట్విట్టర్' సెగ
ట్విట్టర్లో ఆస్టేలియా జర్నలిస్టులపై విపరీత వ్యాఖ్యలు చేశాడంటూ విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు క్రికెట్
ఆస్టేలియా (సీఏ) నోటీసులు జారీ చేసింది. తక్షణమే తమ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశించింది. సీఏ.. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన నేరం కింద వార్నర్ ను విచారించనుంది. ఐపీఎల్ లో పేలవ ఫామ్ కనబరుస్తోన్న వార్నర్ ను విమర్శిస్తూ.. ఆసీస్ పాత్రికేయులు రాబర్ట్ క్రాడాక్, మాల్కమ్ కోన్ ఓ వ్యాసం రాశారు. తన ఫామ్ నే ప్రశ్నిస్తారా? అంటూ, వార్నర్ ఈ ఇద్దరు జర్నలిస్టులనుద్ధేశించి ట్విట్టర్ లో బూతుల దండకం చదివేశాడు. సీన్ కట్ చేస్తే.. క్రికెట్
ఆస్ట్రేలియా ఆగ్రహానికి గురయ్యాడు.