పెళ్లయిన మర్నాడే నవ వధువు కిడ్నాప్.. గ్యాంగ్ రేప్!
- యూపీలో దారుణ ఘటన
- అత్తింటి నుంచి నవ వధువు కిడ్నాప్
- కేసు నమోదు చేసిన పోలీసులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతానికి చెందిన యువకుడితో, 17వ తేదీన యువతికి వివాహం జరుగగా, ఆపై ఆమె అత్తారింట్లో కాలుమోపింది. మరుసటి రోజే ఆమె కనిపించకుండా పోగా, ఆమె కోసం వెతికిన బంధుమిత్రులు, పోలీసులను ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఆదివారం నాడు హాపూర్ లోని ఓ బ్యాంకు శాఖ సమీపంలో నవ వధువు అపస్మారక స్థితిలో కనిపించింది. ఇంటి నుంచి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన దారుణ ఘటనతో యువతి షాక్ కు గురై, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది. అత్యాచారంపై కేసు నమోదు చేశామని, నిందితులను గాలించేందుకు చర్యలు చేపట్టామని పోలీసు అధికారులు వెల్లడించారు.