Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తంజావూరులో టైగర్ షార్క్స్ స్క్వాడ్రన్ ఏర్పాటు... బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యం ఉన్న విమానాలకు స్థానం

  • తొలిగా సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం చేరిక
  • 18 విమానాల వరకు స్క్వాడ్రన్ లో చోటు
  • బ్రహ్మోస్ క్షిపణులను మోయగలిగే విమానాలతో స్క్వాడ్రన్ బలోపేతం
భారత్ లో ఉన్న అనేక వాయుసేన స్థావరాల్లో తంజావూరు ఎయిర్ బేస్ ఒకటి. దక్షిణ భారతదేశంలో ఉన్నందున వ్యూహాత్మకంగా ఆ స్థావరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తాజాగా ఇక్కడ భారత వాయుసేన టైగర్ షార్క్స్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఆరు యుద్ధ విమానాల్ని ఈ స్క్వాడ్రన్ లో మోహరిస్తారు. ఆపై వాటి సంఖ్యను 18కి పెంచుతారు. మొదటిగా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాన్ని ఈ స్క్వాడ్రన్ లో చేర్చారు. ఈ మేరకు సుఖోయ్ విమానం తంజావూరు ఎయిర్ బేస్ కు తరలి రాగా, అక్కడి సిబ్బంది జలఫిరంగులతో ఘనస్వాగతం పలికారు. కాగా, టైగర్ షార్క్స్ స్క్వాడ్రన్ లో మోహరించే విమానాలను బ్రహ్మోస్ క్షిపణిని మోయగలిగేలా మార్పులు చేర్పులు చేశారు.
Tanjavur
IAF
Squadron
Tiger Sharks
Su-30MKI
India

More Telugu News