అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం మా అదృష్టం: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే
- సీఆర్డీఏ రద్దు బిల్లును స్వాగతిస్తున్నా
- సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదు
- రాజధాని అంటే అందరిదీ.. కొందరిది మాత్రమే కాకూడదు
అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం ప్రకటించడం తమ అదృష్టమని, అమరావతికి దక్కిన గౌరవమని అన్నారు. సెక్రటేరియట్ తో సామాన్యులకు పని ఉండదని చెప్పారు. రాజధాని అంటే అందరిదీ అని, కొందరిది మాత్రమే కాకూడదని అన్నారు. ప్రభుత్వాన్ని పేదవాడి ఇంటిముందుకు జగన్ తెచ్చారని కొనియాడారు. రైతులు కోరుకుంటే భూములను తిరిగి ఇవ్వాలని, అమరావతిని అగ్రికల్చర్ జోన్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయని, రైలు కూత కూడా వినపడని గ్రామాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని చెప్పారు.