5 ప్రత్యర్థి పార్టీల మొత్తం ఆదాయానికి రెట్టింపు అందుకున్న బీజేపీ!
- పొలిటికల్ పార్టీలపై ఏడీఆర్ నివేదిక
- రూ. 2400 కోట్ల ఆదాయంతో బీజేపీ ఫస్ట్
- రూ. 910 కోట్లకు పరిమితమైన కాంగ్రెస్
గడచిన మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా సాధించిన బీజేపీ, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి ప్రధాన విపక్షంగా ఉన్న కాంగ్రెస్ గత ఏడాది రూ. 910 కోట్ల విరాళాలను పొందింది. ఈ మొత్తంలో 41.7 శాతం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లభించిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ కు రూ. 192 కోట్ల ఆదాయం లభించింది. సీపీఎంకు రూ. 108 కోట్లు, సీపీఐకి రూ. 71 కోట్లు, బీఎస్పీకి రూ. 69.70 కోట్ల ఆదాయం లభించింది.