జగన్ అరాచకాలకు అంతు లేకుండా పోయింది: చంద్రబాబు
- ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా?
- నేతల హౌస్ అరెస్ట్ హేయమైన చర్య
- వెంటనే విడిచి పెట్టాలని చంద్రబాబు డిమాండ్
ప్రస్తుతం అమరావతిలో ఎమర్జెన్సీ సమయంలో ఉన్న నిర్బంధం కన్నా అధికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పౌర హక్కులకు భంగం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గృహ నిర్బంధం చేసిన తమ నేతలను వెంటనే విడిచి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.