Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గృహనిర్బంధానికి పోలీసుల యత్నం... కళ్లుగప్పి ఇంటినుంచి అదృశ్యమైన చింతమనేని

  • రేపు అసెంబ్లీ ముట్టడికి టీడీపీ పిలుపు
  • చింతమనేని నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
  • చింతమనేని నివాసం వద్ద పోలీసుల హడావుడి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గృహనిర్బంధానికి పోలీసులు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. రేపు అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు చింతమనేని గృహనిర్బంధానికి రంగం సిద్ధం చేశారు. చింతమనేని నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే, చింతమనేని పోలీసుల కళ్లుగప్పి తన నివాసం నుంచి అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది.
Andhra Pradesh
Amaravati
Assembly
Chinthamaneni Prabhakar
Police
Telugudesam

More Telugu News