టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు... పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని విప్ జారీ
- చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
- అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
- వ్యక్తిగత కారణాలతో రాలేకపోయామన్న నేతలు
కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. విప్ పరిధిలోకి రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలను కూడా తీసుకువచ్చారు. విప్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది.