రోడ్డు ప్రమాదంలో నటి షబానా ఆజ్మీకి గాయాలు
- పూనే నుంచి ముంబయి వస్తుండగా ప్రమాదం
- అదుపుతప్పి ట్రక్కును ఢీకొన్న షబానా కారు
- షబానా భర్త జావెద్ అక్తర్ కు స్వల్ప గాయాలు
ప్రమాదాన్ని చూసిన స్థానికులు వారిని పాన్వెల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం ఆస్పత్రి అధికారులు షబానా ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన చేస్తూ..‘ఆమెకు ముక్కుపై గాయాలయ్యాయి. ఇతర గాయాలు ఏమీ కనిపించడంలేదు. ప్రమాదం మూలంగా ఆమె షాక్ కు గురయ్యారు. చికిత్స కొనసాగుతోంది. పరిస్థితి నిలకడగా ఉంది’ అని చెప్పారు.