'అల్లరి' నరేశ్ తో సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం

  • ముగింపు దశలో 'బంగారు బుల్లోడు'
  • తదుపరి చిత్రానికి దర్శకుడిగా విజయ్ కనకమేడల 
  • ఈ నెల 20వ తేదీన పూజా కార్యక్రమాలు    
హాస్య కథానాయకుడిగా తెరపై నాన్ స్టాప్ గా 'అల్లరి' చేసిన నరేశ్, చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ తరువాత ఆయన జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథల కోసం వెయిట్ చేస్తూ సినిమాల సంఖ్యను తగ్గించాడు. ప్రస్తుతం ఆయన 'బంగారు బుల్లోడు' సినిమాను చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

దాంతో ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ రోజున ఉదయం 9 గంటల 44 నిమిషాలకి హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కెరియర్ పరంగా 'అల్లరి నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.
Go Back to Shorts
Allari Naresh
Varalakshmi Sarathkumar

More Telugu News