ప్రొ.కాశీం నివాసంలో పోలీసుల సోదాలు.. మండిపడ్డ సీపీఐ నారాయణ
- ఓయూ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్‌లో సోదాలు
- మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానం
- తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన సీపీఐ నేత నారాయణ
- ఆయనను పోలీసులు హింసిస్తున్నారని వ్యాఖ్య
కాశీం నివాసంలో సోదాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ నేత నారాయణ తెలిపారు. ఆయన ఇంటిపై దాడులు చేస్తూ ఆయనను పోలీసులు హింసిస్తున్నారని అన్నారు. ఆయనేం సాయుధ పోరాటం చేయలేదని చెప్పారు. ఆయన ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారని అన్నారు. ఆయనపై కేసులు పెట్టి ఇప్పటికే మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు.