అందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం: విజయసాయిరెడ్డి

  • 2014-19 మధ్య 20 సార్లు పీడీ యాక్ట్‌ను పొడిగించారు
  • ఇప్పుడు రొటీన్ గా మా ప్రభుత్వం పొడిగిస్తే బాబు గుడ్డలు చించుకుంటున్నారు
  • డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల  విశ్వాసం 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. '2014-19 మధ్య 20 సార్లు తాము పొడిగించిన పీడీ యాక్ట్ ను, ఇప్పుడు రొటీన్ గా మా ప్రభుత్వం పొడిగిస్తే.. బాబు, ఆయన బ్యాచ్ ఎలా గుడ్డలు చించుకుంటున్నారో చెప్పేందుకు ఈ 20 జీవోలే సాక్ష్యం' అంటూ ఇందుకు సంబంధించిన పత్రాలను పోస్టు చేశారు.

'10 లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ సంపద హుష్ కాకి అవుతుందనే టెన్షన్ ముందు సంక్రాంతి పండుగ ఎంత? డబ్బుంటే ప్రతి క్షణం ఉత్సవమే అనేది చంద్రబాబు, ఆయన వర్గీయుల ప్రగాఢ విశ్వాసం. ఈ లోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు. తటస్థులను తెరపైకి తెస్తాడు. దేనికైనా సిద్ధమే విజనరీ' అని విజయసాయిరెడ్డి విమర్శించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Andhra Pradesh
Amaravati

More Telugu News