'హిరణ్యకశిప'పై దృష్టి పెట్టిన రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'హిరణ్యకశిప'పై దృష్టి పెట్టిన రానా

  • 'విరాటపర్వం' షూటింగులో రానా 
  • వేసవిలో విడుదల చేసే ఆలోచన 
  • వేసవిలోనే సెట్స్ పైకి 'హిరణ్య కశిప'
ఒక వైపున తెలుగు .. మరో వైపున హిందీ సినిమాలతో రానా బిజీగా వున్నాడు. ఆయన కథానాయకుడిగా 'హిరణ్యకశిపను రూపొందించడానికి దర్శకుడు గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం సురేశ్ ప్రొడక్షన్స్ వారు భారీ సెట్లను నిర్మిస్తున్నారు. మేజర్ పార్టు షూటింగు ఈ సెట్లలోనే జరుగుతుంది.

ఒకసారి సెట్లోకి అడుగుపెడితే చకచకా పనులు సాగిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ సైడ్ నుంచి కూడా పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. ఆ దిశగానే అన్ని పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం రానా చేస్తున్న 'విరాటపర్వం' కేరళలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. ఆ వెంటనే రానా సెట్స్ పైకి రానున్నట్టుగా చెబుతున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Raana
Guna Sekhar

More Telugu News