డీఎంకే-కాంగ్రెస్ పొత్తు పెటాకులవుతుందని ముందే చెప్పా: కమల్
- పలు సభల్లో నేను ఇదే విషయాన్ని చెప్పా
- రెండు పార్టీలు ప్రస్తుతం విడిపోయే ఆలోచనలో ఉన్నాయి
- మక్కల్ నీదిమయ్యం చీఫ్ కీలక వ్యాఖ్యలు
డీఎంకే పొత్తు ధర్మం పాటించలేదని కాంగ్రెస్ నేతలు కేఎస్ అళగిరి, కేఆర్ రామస్వామి ఇటీవల విమర్శలు చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్పైనా విమర్శలు చేయడంతో ఆ పార్టీ నేత దురైమురుగన్ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. డీఎంకేపై తమకు అపారమైన గౌరవం ఉందని, కూటమి నుంచి విడిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు.