విభిన్నంగా వుంటే విలన్ పాత్రలకి ఓకే: హీరో రవితేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభిన్నంగా వుంటే విలన్ పాత్రలకి ఓకే: హీరో రవితేజ

  • 'డిస్కోరాజా'గా విభిన్నపాత్రలో రవితేజ 
  • నాయికలుగా ముగ్గురు ముద్దుగుమ్మలు 
  •  ఈ నెల 24వ తేదీన విడుదల 
పాత్ర ఏదైనా తనదైన మేనరిజమ్స్ తో ప్రేక్షకులను హుషారెత్తించడం రవితేజ ప్రత్యేకత. అలాంటి రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'డిస్కోరాజా' ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ .. "గతంలో నేను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. కథాకథనాలు .. దర్శకుడు వీఐ ఆనంద్ టేకింగ్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమా ఉంటుంది. కాన్సెప్ట్ లోను .. పాత్రల్లోను కొత్తదనం వుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు. అలాంటి ప్రేక్షకుల కోసం విలన్ గా కనిపించడానికి కూడా నేను సిద్ధమే. అయితే ఆ విలనిజం కొత్తగా ఉండాలి .. విభిన్నంగా ఉండాలి. అలాంటి విలన్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను" అన్నారు. 'డిస్కోరాజా'లో రవితేజ సరసన నాయికలుగా నభా నటేశ్ .. పాయల్ .. తాన్యా హోప్ సందడి చేయనున్నారు.
Raviteja
Nabha Natesh
Payal
Thanya

More Telugu News