Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • పూజ హెగ్డేకు బాలీవుడ్ ఆఫర్ 
  • అమెరికాకు వెళుతున్న మహేశ్ 
  • విజయ్ సేతుపతికి పది కోట్లు!
 *  తెలుగులో వరుస విజయాలతో టాప్ స్టార్ గా రాణిస్తున్న పూజ హెగ్డేకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'బచ్చన్ పాండే' చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమెను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇందులో ఓ హీరోయిన్ గా కృతి సనాన్ ఎంపికైంది.
*  తన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' విజయంతో మహేశ్ బాబు మంచి హ్యాపీ మూడ్ లో వున్నాడు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో కలసి వెకేషన్ కి వెళుతున్నాడు. ఈసారి అమెరికా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
*  తమిళంలో హీరోగా నటిస్తూ బిజీగా వున్న విజయ్ సేతుపతి ఇటీవల తెలుగులో పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే చిత్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించడానికి ఓకే చెప్పాడు. ఇందుకు గాను 10 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Pooja Hegde
Akshay Kumar
Mahesh Babu
Allu Arjun

More Telugu News