వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మహిళల ఆగ్రహం
- 18 మంది రైతులు మరణించినా పరామర్శించలేదు
- మమ్మల్ని కలిసినట్టు అబద్ధాలు చెబుతున్నారు
- మా పోరాటం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం
రాజధాని కోసం గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా, 18 మంది రైతులు మరణించినా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనీసం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆమె తమను కలిసి పరామర్శించినట్టు చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తమను కలవలేదని తేల్చి చెప్పారు. అమరావతి కోసం తమ పోరాటం కేవలం తమకోసం మాత్రమే కాదని, ఐదుకోట్ల ఆంధ్రుల కోసమని మహిళలు పేర్కొన్నారు.