ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ నియామకం!
- ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శైలాజానాథ్ నియామకం
- వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, మస్తాన్ వలీ
- రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్
ఈ క్రమంలో ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ ను నియమించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత రఘువీరారెడ్డి స్థానంలో శైలజానాథ్ బాధ్యతలు అందుకుంటారు. ఇక, రాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.