ఎంఐఎంతో స్నేహం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు: కేసీఆర్ పై ధ్వజమెత్తిన కిషన్ రెడ్డి

  • బెల్లంపల్లి వచ్చిన కిషన్ రెడ్డి
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారం షురూ
  • భైంసా ఘర్షణలకు కేసీఆర్ దే బాధ్యతన్న కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చారు. బెల్లంపల్లిలో ప్రచారం షురూ చేసిన కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఎంఐఎంతో స్నేహం చేస్తూ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు.

ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు కేసీఆరే బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలులో బెల్లంపల్లి చేరుకున్న కిషన్ రెడ్డి.. పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారం తర్వాత మధ్యాహ్నం నుంచి చెన్నూరు, గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో ప్రచారంలో పాల్గొంటారు.
Go Back to Shorts
MIM
TRS
KCR
Kishan Reddy
BJP
Bellampalli

More Telugu News