అభిమాని తలపై కోహ్లీ రూపం.. అబ్బురపరుస్తోన్న వెరైటీ హెయిర్‌స్టైల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభిమాని తలపై కోహ్లీ రూపం.. అబ్బురపరుస్తోన్న వెరైటీ హెయిర్‌స్టైల్!

  • కోహ్లీపై అభిమానాన్ని చాటుకున్న చిరాగ్‌ ఖిలారే 
  • భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేకు వచ్చిన చిరాగ్
  • అతడి హెయిర్‌స్టైల్ చూసి ఫిదా అయిపోయిన కోహ్లీ అభిమానులు 
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ముఖం ఆకారంలో ఓ అభిమాని హెయిర్‌ కటింగ్ చేయించుకున్నాడు. అతడి హెయిర్‌స్టైల్ కోహ్లీ అభిమానులను ఆకర్షిస్తోంది. అబ్బుర పరుస్తున్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
        ఈ అభిమాని పేరు చిరాగ్‌ ఖిలారే. తాజాగా అతడు ఈ ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'ది బెస్ట్‌ ఐయామ్‌ కోహ్లీ ఫ్రమ్‌ హార్ట్‌ టు హెడ్‌, విరాటియన్‌ చిరాగ్‌' అని రాసుకొచ్చాడు. ఇటీవల భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేకు చిరాగ్ వచ్చాడు. మైదానానికి వచ్చిన క్రికెట్‌ అభిమానులు చిరాగ్ హెయిర్‌స్టైల్ చూసి ఆశ్చర్యపోయారు.

అభిమానులు క్రికెటర్ల టాటూలను వేయించుకోవడం సాధారణమే. లేదంటే అచ్చం తమ అభిమాన హీరోలు ఎలా హెయిర్ కటింగ్ చేయించుకుంటారో అలాగే అభిమానులు చేయించుకుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా చిరాగ్ సరికొత్త ఆలోచనతో ఇలా అలరించాడు. గతంలోనూ అతడు వినూత్న రీతిలో కోహ్లీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
Virat Kohli
Crime News
Twitter

More Telugu News