టీవీ చానెల్ లైవ్ లో ప్రేయసిని హత్య చేసినట్టు వెల్లడి... వెంటనే వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ చానెల్ లైవ్ లో ప్రేయసిని హత్య చేసినట్టు వెల్లడి... వెంటనే వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు!

  • 2010లో ప్రియురాలి హత్య
  • కొత్త సంవత్సరం వేడుకల కోసం పిలిచి దారుణం
  • మరో హత్య కూడా చేశాడంటున్న పోలీసులు
తాను చేసిన ఓ హత్య గురించి టీవీ చానెల్ షోలో వెల్లడించిన ఓ వ్యక్తి, ఆ షో పూర్తికాకముందే కటకటాల వెనక్కు వెళ్లాడు. హత్యలు చేసిన పదేళ్ల తరువాత అతను దొరికిపోవడం గమనార్హం. ఈ ఘటన చండీగఢ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహీందర్ సింగ్ అనే వ్యక్తి, ఓ టీవీ చానెల్ లో జరుగుతున్న లైవ్ షోలో పాల్గొనేందుకు వచ్చాడు.

2010లో తన ప్రియురాలు సరబ్జిత్ కౌర్ ను హత్య చేసినట్టు ఈ కార్యక్రమంలో అంగీకరించాడు. తన బావతో ఆమె సంబంధం పెట్టుకున్నందునే అలా చేయాల్సి వచ్చిందని అన్నాడు. న్యూ ఇయర్ డే వేడుకల కోసం పిలిపించి, ఓ హోటల్ లో హత్య చేశానని చెప్పాడు.

ఇక ఈ షో గురించి, మహీందర్ చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకుని, వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు, అతన్ని లైవ్ కార్యక్రమం జరుగుతుండగానే అరెస్ట్ చేశారు. కాగా, నిందితునిపై మరో హత్య కేసు కూడా ఉందని, దానిపై కొంత కాలం శిక్షను అనుభవించి, బెయిల్ పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు.
Lover
Murder
TV Channel
Live
Police
Arrest

More Telugu News