ఫడ్నవీస్ లేఖ.. ‘తానాజీ’కి పన్ను మినహాయింపునకు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫడ్నవీస్ లేఖ.. ‘తానాజీ’కి పన్ను మినహాయింపునకు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకంగా వ్యవహరించిన తానాజీ
  • పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం ఫడ్నవీస్
  • ఓకే చెప్పిన మహా కేబినెట్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకంగా వ్యవహరించిన తానాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘తానాజీ’. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, కాజోల్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హరియాణా ప్రభుత్వం ఇప్పటికే పన్ను మినహాయింపునిచ్చింది.  

మరోపక్క, తానాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. ఈ క్రమంలో నిన్న జరిగిన 'మహా' కేబినెట్ సమావేశంలో ‘తానాజీ’కి పన్ను మినహాయింపుపై మంత్రులు తీవ్రంగా చర్చించారు.

అనంతరం ఈ సినిమాకు పన్ను రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి బాలా సాహెబ్ తోరత్ మాట్లాడుతూ.. ‘తానాజీ’కి పన్ను మినహాయింపు ఇవ్వాలని మంత్రి వర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేస్తారని తెలిపారు.
taanaji
Maharashtra
Bollywood

More Telugu News