నాగబాబు సార్ వెళ్లిన పరిస్థితులు వివరించలేను: హైపర్ ఆది
- సంక్రాంతి కోసం సొంతూరు వెళ్లిన హైపర్ ఆది
- నాగబాబు గురించి స్పందన
- ఇప్పటికీ నాగబాబు తమతో మాట్లాడుతుంటారని వెల్లడి
నాగబాబు మరో కార్యక్రమానికి వెళ్లినా, ఆయన తమ అభివృద్ధినే కాంక్షిస్తుంటారని, బాగా చేయాలంటూ మెసేజ్ లు పంపిస్తుంటారని ఆది వెల్లడించారు. ఇప్పటికీ ఆయన తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతుంటారని తెలిపారు. అయితే నాగబాబు సార్ వెళ్లిన పరిస్థితులను బయటికి వెల్లడించలేనని అన్నారు.