హైదరాబాదు ఐటీ ఉద్యోగిని రోహిత మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
- గత నెలలో అదృశ్యమైన రోహిత
- సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న యువతి
- పూణేలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు
చివరికి రోహిత పూణేలో ఉన్నట్టు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. డిసెంబరు 26న ఆమె ఇంట్లోంచి వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు. పైగా ఆమె కనిపించకుండా పోవడానికి ముందు బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.80 వేలు డ్రా చేసింది. ఫోన్ ను సైతం ఇంట్లోనే వదిలి వెళ్లిపోయింది. రోహిత కొన్నాళ్లుగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. కుటుంబ సమస్యల కారణంగానే తాను పూణే వెళ్లినట్టు రోహిత పోలీసులకు వెల్లడించింది. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.