'ఆర్ఆర్ఆర్' అప్ డేట్... బ్రిటీష్ వారితో అల్లూరి, కొమురం పోరాడే సీన్స్ హైలైట్ అట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆర్ఆర్ఆర్' అప్ డేట్... బ్రిటీష్ వారితో అల్లూరి, కొమురం పోరాడే సీన్స్ హైలైట్ అట!

  • రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం
  • ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి
  • యాక్షన్ సీన్స్ కోసం ఎంతో కసరత్తు
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా తెరకెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' (వర్కింగ్ టైటిల్), చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తికాగా, బ్రిటీష్ వారితో వీరిద్దరూ కలిసి పోరాడే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సీన్ ను రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించారని, ఆయన శ్రమ తెరపై కనిపిస్తుందని అంటున్నారు. ఇక యాక్షన్ సీన్స్ కోసం సెల‌బ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రయినర్ రాకేష్ ఉడియార్ ఆధ్వ‌ర్యంలో ఇద్దరు హీరోలూ ఎంతో కసరత్తు చేశారన్న సంగతి తెలిసిందే. భారత స్వాతంత్ర్య సంగ్రామ పోరులో రెండు పాత్రల మధ్య జరిగిన ఓ కల్పిత కథ ఆధారంగా ఈ సినిమాను రాజమౌళి రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సీతగా అలియా భ‌ట్, ఎన్టీఆర్ పక్కన బ్రిటీష్ యువతిగా ఒలీవియోలతో పాటు స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్, అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. 
Rajamouli
RRR
NTR
Ramcharan

More Telugu News