బ్యాక్ గ్రౌండ్ లో అగ్నిపర్వతం పేలినా... పెళ్లి మాత్రం ఆగలేదు!

  • ఫిలిప్పీన్స్ లో ఘటన
  • విస్ఫోటనం చెందిన తాల్ అగ్నిపర్వతం
  • అయినా పెళ్లి చేసుకున్న జంట
ఫిలిప్పీన్స్ లో తాజాగా తాల్ అగ్నిపర్వతం బద్దలైంది. లూజాన్ దీవిలోని సౌత్ మలీనాలో ఈ అగ్నిపర్వతం కొలువై ఉంది. ఇది విస్ఫోటనం చెందడంతో 60 కిలోమీటర్ల పరిధిలో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అయితే, తాల్ వాల్కనో బద్దలైన సమయంలోనే ఓ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లికి వచ్చిన అతిథులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పెళ్లెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు అక్కడి నుంచి జంప్ అవుదామా అని ఎదురుచూడాల్సి వచ్చింది. తాల్ వాల్కనోకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ పెళ్లి జరిగింది.

సరిగ్గా ఉంగరాలు మార్చుకునే సమయానికి ఆకాశం నలుపు రంగు పులుముకుంది. ఏంటని చూస్తే అగ్నిపర్వతం బద్దలవడంతో పైకి ఎగసిన ధూళి ఆకాశాన్నంటింది. దాంతో, అతిథులు పరుగులు తీసేందుకు ప్రయత్నించగా, వధూవరులు వారిని అభ్యర్థించి, పెళ్లి అయ్యేంత వరకు ఆగాలన్నారు. ఓవైపు బ్యాక్ గ్రౌండ్ లో తాల్ అగ్నిపర్వతం నిప్పులు కక్కుతుండగా, హడావుడిగా పెళ్లితంతు ముగించారు. పెళ్లి ముగిసిందన్న మరుక్షణమే నిమిషాల్లో వేదికను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
Go Back to Shorts
Taal
Volcano
Philippines
Wedding
Couple

More Telugu News