నటి నందితా శ్వేతకు అసభ్య మెసేజ్ లు... 'అమ్మానాన్నలు లేరా?' అంటూ ఘాటు కౌంటర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటి నందితా శ్వేతకు అసభ్య మెసేజ్ లు... 'అమ్మానాన్నలు లేరా?' అంటూ ఘాటు కౌంటర్!

  • చెప్పలేని భాషలో వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేయడం నా ఉద్దేశం కాదు
  • వ్యవహారం సద్దుమణిగి వేధింపులు ఆగాలన్న నందిత
తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నందితా శ్వేత ఇప్పుడు ఎస్ఎంఎస్ ల ద్వారా అసభ్య మెసేజ్ ల వెల్లువను ఎదుర్కుంటోంది. 'అట్టకత్తి' చిత్రం ద్వారా పరిచయమై, ఆపై తెలుగు, కన్నడ భాషల్లోనూ తెరంగేట్రం చేసిన ఈ హాట్ భామ సెల్ ఫోన్ కు ఇప్పుడు వేధింపుల మెసేజ్ లు తెగ వచ్చేస్తున్నాయట. ఎక్కడ దొరికిందో, ఏమో, ఈమె సెల్ ఫోన్ నంబర్ ను సంపాదించిన వేధింపు రాయుళ్లు, చెప్పలేని భాషలో మెసేజ్ లు పెడుతున్నారు.

వీరి మెసేజ్ లను చూసి తట్టుకోలేకపోయిన నందితా శ్వేత, విషయాన్ని స్వయంగా మీడియా ముందు వెల్లడించి, వాపోయింది. ముఖ్యంగా వాంజి సెలియన్ అనే యువకుడి నుంచి వస్తున్న మెసేజ్ లు చూసి తట్టుకోలేకపోతున్నానని చెప్పింది.

అతనికి అమ్మానాన్నలు లేరా? అని మండిపడింది. వారికీ కుటుంబం ఉంటుందని, ఇటువంటి వ్యక్తులకు ఏం చేస్తే బుద్ధి వస్తుందని ఘాటు కౌంటర్ ఇచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడం తన ఉద్దేశం కాదని అంది. పోలీసుల వరకూ వెళితే, మరింత రచ్చ అవుతుందని, ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణగాలన్నదే తన అభిమతమని చెప్పింది. కాగా, ప్రస్తుతం నందితా శ్వేత తమిళంలో' తానా', తెలుగులో 'అక్షర', 'ఐపీసీ 376' సినిమాల్లో నటిస్తోంది.
Nandita Swetha
Harrasment
Cell phone

More Telugu News