దీపిక వీటి గురించి తెలుసుకోవాలి: బాబా రాందేవ్
- నటనలో దీపిక ప్రతిభావంతురాలు
- సామాజిక, రాజకీయ అంశాలపై ఆమె మరింత తెలుసుకోవాలి
- అందుకే నాలాంటి సలహాదారుడిని నియమించుకోవాలి
ఈ క్రమంలో యోగా గురు బాబా రాందేవ్ స్పందిస్తూ, నటన విషయంలో దీపిక చాలా ప్రతిభావంతురాలని ఆయన కితాబిచ్చారు. అయితే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో పాటు దేశం గురించి ఆమె మరింతగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తనలాంటి ఓ సలహాదారుడిని నియమించుకోవాలని సలహా ఇచ్చారు. తనలాంటి వ్యక్తుల సలహాలు స్వీకరిస్తే ఆమె సరైన వ్యాఖ్యలు చేయగలుగుతారని అన్నారు.