ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలి: సీఎం కేసీఆర్
- ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు వెల్లివిరియాలి: సీఎం కేసీఆర్
- ప్రగతి భవన్ లో ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సీఎం కేసీఆర్
- పలు అంశాలపై ఇరువురి సీఎంల మధ్య చర్చలు
కేసీర్,జగన్ మధ్య కొనసాగుతున్న చర్చలు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రగతి భవన్ లో సమవేశమైన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజధాని అంశంపై అమరావతిలో జరుగుతున్న నిరసనలను కేసీఆర్ కు జగన్ వివరించినట్లు సమాచారం. విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, ఎన్పీఆర్, ఎన్నార్సీ, ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల అంశంపై .. చర్చిస్తున్నారని తెలుస్తోంది.
