నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విధానాన్ని వివరించిన అధికారులు
- వారి ప్రవర్తనలో తేడా కనిపించలేదన్న అధికారులు
- కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇస్తున్నామని వెల్లడి
- ఉరితీత ట్రయల్స్ నిర్వహించిన తీహార్ జైలు అధికారులు
ఉరిశిక్ష అమలుకు ముందు దోషులను వారి కుటుంబ సభ్యులతో ఒక్కసారి కలిసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. సాధారణంగా ఖైదీలు వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు. ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో దోషులకు ఆ అవకాశం ఉండదు. ఇప్పటివరకు తీహార్ జైల్లోని ఉరికంబం ఒకేసారి ఇద్దర్ని ఉరితీసేందుకు మాత్రమే అనువైనదిగా ఉండేది. కానీ, ఈసారి నలుగుర్ని ఉరితీయాల్సి ఉండడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తాజాగా, ఉరితీత కోసం ట్రయల్స్ నిర్వహించారు. ట్రయల్స్ లో భాగంగా దోషుల బరువుకు సమానమైన ఇసుక మూటలను ఉరికంబానికి వేళ్లాడదీశారు.