అమెరికా స్థావరాలపై రాకెట్లతో విరుచుకుపడిన ఇరాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా స్థావరాలపై రాకెట్లతో విరుచుకుపడిన ఇరాన్

  • అల్ బలాద్ ఎయిర్‌బేస్‌పై దాడి
  • ఎనిమిది రాకెట్లు తమ స్థావరాన్ని తాకాయన్న ఇరాక్
  • ట్రంప్ ట్వీట్ చేసిన కాసేపటికే ఇరాన్ దాడి
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోమారు దాడులకు తెగబడింది. బాగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్‌ బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం 8 రాకెట్లు తమ స్థావరాన్ని ఢీకొట్టినట్టు ఇరాక్ తెలిపింది. ఈ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడ్డారు. ఇరాన్ సైనికాధికారిని అమెరికా హతమార్చడంతో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా అలాగే ఉన్నట్టు తాజా దాడితో స్పష్టమైంది. మరోవైపు, ఇరాన్‌ను అమెరికా హెచ్చరిస్తూనే ఉంది. తీరు మార్చుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ ఈ దాడికి పాల్పడడం గమనార్హం.
America
Iran
Iraq

More Telugu News