పవన్, చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెలియని జనసేన నేతలు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారు: ద్వారంపూడి
- చంద్రబాబు, పవన్ లపై ద్వారంపూడి వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఉద్రిక్తత
- స్పందించిన ద్వారంపూడి
ఎన్నికల సమయంలో పవన్ ఒక్క టీడీపీ నేతను కూడా టార్గెట్ చేయలేదని, వైసీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా, కాపు ఉద్యమం సాగుతున్న సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబంపై లాఠీచార్జి జరిగితే పవన్ ఖండించలేదని, జనసేన పార్టీ నుంచి సైతం ఎలాంటి స్పందన లేదని అన్నారు. చంద్రబాబు కాపు ఉద్యమానికి వ్యతిరేకి కావడంతో పవన్ మౌనం వహించాడని విమర్శించారు.