ట్రంప్ ఆదేశించారు... సైన్యం ఫెయిల్... బతికిపోయిన అబ్దుల్ రెజా షహ్లైనీ!
- ఇరాన్ ప్రధాన సైనిక కమాండర్ అబ్దుల్ రెజా హత్యకు ప్లాన్
- ఆ సమయంలో యెమెన్ లో ఉండి బతికిపోయిన రెజా
- అధికారికంగా ప్రకటించిన పెంటగాన్
తమ ప్రణాళిక అమలుకు వేచి చూశామని, అది విఫలమైనందున మరిన్ని విషయాలు చెప్పలేమని పెంటగాన్ అధికార ప్రతినిధి రెబెకా రెబరిచ్ వ్యాఖ్యానించారు. షియా మిలిటెంట్ గ్రూపులకు ఆయుధాలను, నిధులను అందిస్తోంది అబ్దుల్ రెజా అని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అతని కార్యకలాపాలపై సమాచారం ఇస్తే, భారీ మొత్తంలో నజరానా ఇస్తానని అమెరికా ప్రకటించింది.