ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
- హైపవర్ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- 18న కేబినెట్ భేటీ
- రాజధానిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం
అసెంబ్లీ సమావేశాలకంటే ముందే ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ఈ భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలు, హైపవర్ కమిటీ సిఫారసులు, పాలన వికేంద్రీకరణపై మరోసారి దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.