ఉసూరుమనిపించిన దీపిక పదుకునే సినిమా కలెక్షన్లు

  • ఎన్నో అంచనాలతో విడుదలైన 'ఛపాక్'
  • తొలిరోజు కేవలం రూ. 4.77 కోట్ల వసూళ్లు
  • ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించిన దీపిక
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన దీపిక పదుకునే తాజా చిత్రం 'ఛపాక్' బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. తొలిరోజు కేవలం రూ 4.77 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

దీనిపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ, హైఎండ్ మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఈ చిత్రం కొంతమేర రాణించిందని చెప్పారు. వారాంతం నేపథ్యంలో వసూళ్లు కొంతమేర పెరిగే అవకాశం ఉండవచ్చని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు మాత్రం వసూళ్లలో విఫలమైందని చెప్పారు. టైర్-2, టైర్-3 సిటీలు, మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పారు.

ఈ చిత్రంలో దీపిక ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా... తొలిసారి నిర్మాతగా కూడా వ్యవహరించింది. సినిమా ఆశించనమేరకు అలరించకపోవడంతో... నటిగా, నిర్మాతగా రెండు విధాలా దీపిక నష్టపోయినట్టైంది.
Go Back to Shorts
Deepika Padukone
Chhapaak Movie
Bollywood
Collections

More Telugu News