Vijayasai Reddy: సబ్బుతో స్నానం చేయించి ముద్దులు ఇవ్వండంలాంటి చెత్త సలహాలన్నీ మీవే కదా: బుద్ధా వెంకన్న

  • విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెంకన్న
  • జగన్ కు చిల్లర సలహాలు ఇచ్చేది మీరే కదా? అంటూ సెటైర్
  • తండ్రి శవాన్ని కూడా చూడకుండా సంతకాల కోసం జోలె పట్టే సలహా కూడా మీదే కదా?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ కు చిల్లర సలహాలు ఇచ్చే ముఖ్య సలహాదారుడు మీరే కదా? అని ఎద్దేవా చేశారు. తండ్రి శవాన్ని కూడా చూడకుండానే సంతకాలు పెట్టమని జోలె పట్టి అడుక్కునే సలహా ఇచ్చింది కూడా మీరే కదా? అని ప్రశ్నించారు. పెద్ద రోగంతో పోయిన వ్యక్తి కూడా మా మహా మేత కోసం పోయారంటూ బిల్డప్ యాత్ర సలహా కూడా మీదే కదా? అని అన్నారు.

పాదయాత్ర సందర్భంగా సబ్బుతో స్నానం చేయించి ముద్దులు ఇవ్వడం... పచ్చని పొలాలు, రైళ్లను తగలబెట్టి మొసలి కన్నీరు కార్చడం... డ్రామా కంపెనీని తలపించేలా యాక్షన్ సీన్లు... ఇలా ఒకటేమిటి అన్ని చెత్త పనులకు మీరే డైరెక్టర్ కదా విజయసాయిరెడ్డీ అంటూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Vijayasai Reddy
Budda Venkanna
Telugudesam
YSRCP
Jagan

More Telugu News