బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మళ్లీ లక్ష్మణ్‌కే పగ్గాలు?
- లక్ష్మణ్ పగ్గాలు చేపట్టి మూడేళ్లు
- రేసులో పలువురు సీనియర్లు
- లక్ష్మణ్‌నే ఈసారికి కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయం?
అధ్యక్ష పదవికి పలువురు సీనియర్లు పోటీపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్టు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. అలాగే, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి, రాంచందర్‌రావు, యెండెల లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, చివరికి లక్ష్మణ్‌కే మరోమారు పగ్గాలు అప్పగించాలని అధిష్ఠానం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.