సీబీఐ కోర్టు న్యాయమూర్తికి జగన్ విన్నపం.. సీబీఐ అభిప్రాయాన్ని కోరిన జడ్జి!
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి
- సహ నిందితుడు నా తరఫున హాజరవుతాడు
- న్యాయమూర్తికి తెలిపిన జగన్
తాను కీలకమైన పదవిలో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని, తన తరఫున కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఓ పిటిషన్ వేయగా, న్యాయమూర్తి దానిని పరిగణనలోకి తీసుకుని సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ, విచారణను తదుపరి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జగన్ కోర్టులో రెండు గంటల పాటు వున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులంతా నేడు కోర్టుకు హాజరు కావడంతో, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇతర కేసుల్లో కక్షిదారులకు, న్యాయవాదులకు కొంతమేర ఇబ్బందులు కలిగాయి.