ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. హైదరాబాదులో పోలీసు వాహనానికి జరిమానా!

  • ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన జీపు
  • ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తి
  • రూ.1135 జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన ఓ పోలీసు వాహనానికి అధికారులు జరిమానా విధించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన జీపు.. ఉప్పల్ రింగురోడ్డు సమీపంలో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లింది. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ఈ ఫొటో వైరల్ అయి చివరికి రాచకొండ కమిషనరేట్‌కు చేరింది. స్పందించిన పోలీసులు వాహనానికి రూ.1135 జరిమానా విధించారు. ఇప్పుడు జరిమానా రశీదు కూడా సోషల్ మీడియాకెక్కి చక్కర్లు కొడుతోంది.
Go Back to Shorts
Hyderabad
police jeep
traffic challan

More Telugu News