ఇలా విడుదలైందో, లేదో.. ‘దర్బార్’కు అలా షాకిచ్చిన తమిళ్ రాకర్స్
- దర్బార్కూ తప్పని పైరసీ బెడద
- భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దర్బార్’
- గంటల వ్యవధిలోనే పైరసీ చేసిన తమిళ రాకర్స్
పైరసీ చేయడంలో సిద్ధహస్తులైన తమిళ రాకర్స్.. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ భాషలో సినిమా విడుదలైనా వెంటనే పైరసీ చేసేస్తుంటారు. తాజాగా రజనీ సినిమాను లీక్ చేసి నిర్మాతలకు షాకిచ్చారు. కాగా, ఈ సినిమాలో రజనీ డ్యూయల్ రోల్ పోషించారు. పోలీసాఫీసర్ ఆదిత్య అరుణాచలంగా, సామాజిక కార్యకర్తగా రెండు పాత్రల్లో ఒదిగిపోయారు.